దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుంది: సీఎం జగన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2020-03-08 07:23 GMT
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతిని సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుంది. అమ్మఒడి నుండి పేదలకు ఇళ్ల పట్టాల వరకు.. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అంతిమంగా మహిళా సాధికారతకు తోడ్పడుతున్నందుకు సంతోషంగా ఉందని ట్విటర్‌ వేదికగా సీఎం జగన్ పేర్కొన్నారు. 



Tags:    

Similar News