Health Department AP Notification 2020: రెండు, మూడు రోజుల్లో పోస్టుల భర్తీ.. కోవిడ్ నియంత్రణకు పగడ్భందీ వ్యూహం

Health Department AP Notification 2020: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజుకు పది వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.

Update: 2020-08-05 00:45 GMT
Health Department AP Notification

Health Department AP Notification 2020: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజుకు పది వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. మరి కొన్నిచోట్ల టెస్టింగులు పూర్తిస్తాయిలో జరిగితే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. వీరందరికీ వైద్యం అందించేందుకు తాత్కాలిక ఆఃస్పత్రులతో పాటు అదనంగా బెడ్లను ఏర్పాటు చేస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా, వీరికి వైద్య సేవలందించేందుకు అవసరమైన సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమించేందుకు యుద్ధప్రాతిపధికన చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే పదిరోజుల క్రితం చర్చించిన ఏపీ సీఎం జగన్, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. వెంటనే నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17వేల పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షించారు.

కరోనా వైద్య సేవల కోసం స్పెషలిస్టు వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, స్టాఫ్‌నర్సులు, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పోస్టులను ఈ నెల 7వ తేదీలోపు భర్తీ చేస్తామన్నారు. ఆయన మంగళవారం కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లలోని వసతులపై రోగులతో ఆరా తీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

► రెగ్యులర్‌ వైద్య సిబ్బంది పోస్టులను 10వ తేదీలోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించాం. కరోనా రోగుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

► వెంటిలేటర్లు,ఆక్సిజన్‌ బెడ్లు, మందుల కొరత లేదు. కోవెలకుంట్ల మండలం ఉయ్యాలవాడకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటున్నారని, మంచి భోజనం పెడుతున్నారని తెలిపారు. కోడుమూరుకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. అమీలియో కోవిడ్‌ ఆస్పత్రిలో సదుపాయాలు బాగున్నాయని వివరించారు. మంత్రి బుగ్గన, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News