AP CM YS Jagan: నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్...

AP CM YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 మూడు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి..

Update: 2020-09-22 01:25 GMT

YS jagan (file photo)


AP CM YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 మూడు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అమిత్ ‌షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లను కలిసే ఉన్నట్టు తెలుస్తోంది. తన పర్యటనలో ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ పన్నుల వాటాను విడుదల చేయాలని మంత్రులను జగన్ కోరనున్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న అంశాలు, పార్లమెంటులో జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చిలో లాక్‌డౌన్ తరువాత సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండటం ఇదే తొలిసారి. తన ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 23న(బుధవారం) విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్‌ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6:20 నిమిషాలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న(గురువారం) ఉదయం 8:10 నిమిషాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్‌ జగన్ పాల్గొనున్నారు.


Full View


Tags:    

Similar News