YS Jagan Allocates Portfolios to New Ministers: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

YS Jagan Allocates Portfolios to New Ministers: బుధవారం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Update: 2020-07-22 15:27 GMT

YS Jagan Allocates Portfolios to New Ministers: బుధవారం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెల్లుబోయిన వేణుగోపాల్ కు.. బిసి సంక్షేమ శాఖ కేటాయించగా.. సీదిరి అప్పలరాజుకు మత్స , పశుసంవర్ధక శాఖ కేటాయించారు. అంతేకాదు ఇద్దరు పాత మంత్రుల శాఖలను కూడా మార్చారు. నిన్నటిదాకా రోడ్లు భవనాల శాఖా మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ కు ప్రమోషన్ లభించింది. ఆయనను రెవెన్యూ మంత్రిగా ప్రమోట్ చెయ్యడమే కాకుండా డిప్యూటీ సీఎంగా కూడా ఎంపిక చేశారు. గతంలో రెవెన్యూ శాఖను ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు నిర్వహించడం విశేషం. ఇక అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర్ నారాయణ నిన్నటివరకూ బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్నారు..

ఆయనకు కూడా ప్రమోషన్ లభించింది. ఆయనకు రోడ్డు, భవనాల శాఖ అప్పజెప్పారు. కాగా వేణుగోపాల కృష్ణ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే సీదిరి అప్పలరాజు కూడా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఇక శంకర్ నారాయణ కూడా అనంతపురం జిల్లా శాసనసభ్యునిగా పెనుగొండ నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. ధర్మాన కృష్ణదాస్ మాత్రం మూడోసారి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.   

Tags:    

Similar News