ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఏపీ సీఎం జగన్

Update: 2021-01-21 04:27 GMT
ఏపీ సీఎం జగన్ (పాత చిత్రం)

ఏపీ సీఎం జగన్‌.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ.. సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేస్తున్నారు. ఏ రాష్ర్టంలో లేని వినూత్న కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు.

రేషన్‌ సరుకుల కోసం కార్డుదారులు.. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను గుర్తించిన సీఎం జగన్... ఇంటి వద్దే వాటిని అందజేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను ఇవాళ ప్రారంభించనున్నారు.

కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకు సీల్‌ ఉంటుంది. అలాగే.. ప్రతి సంచికీ కూడా యూనిక్‌ కోడ్‌ ఉండడం వల్ల ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ చేయబడుతుంది. అన్ని మొబైల్‌ వాహనాలకు జీపీఎస్‌ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్‌యాప్‌ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్‌ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది.

కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి 2వేల 500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంచ్‌ సర్కిల్‌ వద్ద సీఎం జగన్‌ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదేరోజు మంత్రులు ప్రారంభిస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం 9వేల 260 వాహనాలను సిద్ధం చేశారు అధికారులు.

Tags:    

Similar News