ఏపీలో రేపటినుంచి కులగణన.. పదిరోజుల పాటు కులాలవారీగా వివరాల సేకరణ
Caste Census: సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించే లక్ష్యంతో కులగణన
ఏపీలో రేపటినుంచి కులగణన.. పదిరోజుల పాటు కులాలవారీగా వివరాల సేకరణ
Caste Census: ఏపీలో రేపటినుంచి కులగణన ప్రారంభం కానుంది. పదిరోజుల పాటు కులాలవారీగా వివరాలు సేకరించనున్నారు అధికారులు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ సంక్షేమ శాఖ సంయుక్తంగా గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి కులగణన చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హుడైన ప్రతీ వ్యక్తికి అందాలనే లక్ష్యంతో కులగణన చేపడుతోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక యాప్ కూడా రూపొందించింది. పదిరోజుల పాటు ప్రజల నుంచి వివరాల సేకరించిన తర్వాత.. సచివాలయాల దగ్గర వివరాలు తీసుకోనుంది ప్రభుత్వం.