AP Cabinet Meeting: సెప్టెంబర్ 25న ఏపీ కేబినెట్ సమావేశం...
AP Cabinet Meeting | ఈ నెల 25 న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
YS Jagan (File Photo)
AP Cabinet Meeting | ఈ నెల 25 న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితులు, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు, నవరత్నాల అమలుపై దృష్టి సారించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై కూడా చర్చించనున్నారు అని సమాచారం.
కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన ఇతర అంశాలపై ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అన్ని విభాగాలను ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రం నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలు, జిఎస్‌టి మొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేయడం.. వంటి అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ ఎంపీలు ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తిన విషయం తెలిసిందే.
సంక్షేమ పథకాలపై, అలగే రాష్ట్రంపై పడుతున్నఆర్థిక భారం వంటి అంశాల గురించి ప్రధానంగా మంత్రివర్గం చేర్చించే అవకాశం ఉంది. మరోవైపు, హిందూ దేవాలయాలపై ఇటీవల జరుగుతున్న దాడులపై మంత్రులు చర్చించనున్నారు. అంతే కాదు, ఆ దాడులకు కారణమైన వారిని గుర్తించి, వారిపై కటినమైన చర్యలు తెసుకొనే విదంగా చర్యలు తెసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను జరీ చేసిన విషయం తెలిసిందే.