ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

Update: 2020-11-05 07:08 GMT

Andhra Pradesh Cabinet Meeting Started : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది.30 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. చిరు వ్యాపారులకిచ్చే 'జగనన్న చేదోడు' పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీపై కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక, ఇసుక పాలసీలో మార్పులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కొత్త ఇసుక విధానంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించింది.

రాష్ట్రంలో భూముల రీసర్వేపై చర్చించడంతో పాటు విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించనుంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌పై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News