Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలోని వార్తలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలోని తాజా వార్తలు

Update: 2021-06-30 01:50 GMT

Andhra Pradesh Latest news 

Andhra Pradesh: 

అనంతపురం జిల్లా:

అనంతపురం జిల్లాలోని అన్ని గ్రామాల్లో జులై 1, 3, 4వ తేదీల్లో పెద్ద ఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. పేదలందరికీ ఇల్లు కింద ఏర్పాటు చేసిన లేఔట్లు.. గ్రామ సచివాలయం.. రైతు భరోసా కేంద్రం నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల గ్రౌండింగ్ కు ప్రజలంతా సహకారం అందిస్తున్నారన్న కలెక్టర్‌.. అధికారులకు కూడా అవగాహన కల్పించామని తెలిపారు.

కడప జిల్లా:

కడప జిల్లా వీరబల్లి మండలం నాయినివారి పల్లె అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. 15 వందల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి.. ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా:

కోవిడ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో టీడీపీ నేతలు సాధన దీక్ష చేశారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పాల్గొన్నారు. కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. కోవిడ్ వల్ల అనేక కుటుంభాలు చిన్నాభిన్నం అయ్యాయని.. ప్రైవేట్ టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోయారని వారికి 10 వేల ఆర్థిక సాయం అందించాలన్నారు.

నెల్లూరు జిల్లా:

నెల్లూరు జిల్లా సోమశిలలో ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి.. రాష్ట్ర స్థాయిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలకు జాబ్ కార్డ్ విడుదల చేయాలని నిరసనకు దిగారు. ఈ మేరకు ఆత్మకూరు ఆర్డిఓకు వినతి పత్రం సమర్పించారు.

నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసులకు దిశ యాప్ పై అవగాహన కల్పించారు సీఐ గంగాధర్. ప్రతి గ్రామంలో మహిళలకు దిశ యాప్ పై అవగాహన కల్పించి.. వారిని చైతన్య పరచాలని సూచించారు. ప్రతీ మహిళతో దిశ యాప్ ను డౌన్ లోడ్ చేపించాలన్నారు.

Tags:    

Similar News