కరోనా వైరస్ పై పోరాటంలో.. ఏపీ బీజేపీ వినూత్న కార్యక్రమం

కరోనా దేశం మొత్తం పోరాడుతుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోడీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-03-28 13:08 GMT

కరోనా దేశం మొత్తం పోరాడుతుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోడీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రజలు స్వీయ నిర్భంధంలో ఉండాలని కోరారు. రోజువారీ కూలీలు, నిరుపేదలు,పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అందరూ తమకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా, ఏపీ బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఒక హెల్ప్ లైన్ నంబర్ విడుదల చేసింది. ఎవరికైనా ఎలాంటి సాయం కావాలన్నా 8142266266 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

ఎవరికి ఏ సమయంలో సాయం కావాలన్నా తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కరోనాపై పోరాటంలో ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్న తక్షణమే అందిస్తామని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 400 మందికి కరోనా పరీక్ష లు నిర్వహించారు. తాజాగా గుంటూరుకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా విశాఖలో 4 , విజయవాడలో 3, గుంటూరులో 2, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి తిరుపతి, కర్నూల్ ఒక్కొక్కటి చొప్పున మొత్తం 14 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News