కాణిపాకంలో సత్యప్రమాణానికి సిద్ధం : విజయసాయి వ్యాఖ్యలకు కన్నా బదులు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.. ఎంపీ సుజనా చౌదరి దగ్గర రూ. 20 కోట్లు తీసుకొని తమ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-20 11:02 GMT
BJP chief Kanna Laxminarayana

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.. ఎంపీ సుజనా చౌదరి దగ్గర రూ. 20 కోట్లు తీసుకొని తమ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. ఈ వ్యాఖ్యలకు కన్నా లక్ష్మీనారాయణ బదులిచ్చారు. ఈ క్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన నిరాధారమైన ఆరోపణలపై కాణిపాకంలో సత్యప్రమాణానికి సిద్ధమని వ్యాఖ్యానించారు.. విజయసాయిరెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అయితే ప్రమాణం చెయ్యాలని అన్నారు.

అంతేకాదు తనపై చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం దావా వేస్తానని అన్నారు కన్నా. కిట్లరేటుపై తాను ప్రశ్నించడం వల్లే వాటిరేటు బయటకుతెలిసి తక్కువధరకు ఇచ్చారని అన్నారు. కాగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల కొనుగోలుపై ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News