Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Emblem of Andhra Pradesh(File Photo)
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పీ భాస్కర్‌ను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ, సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పీ బసంత్‌కుమార్‌ను మున్సిపల్ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించి, ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.