Krishnapatnam: మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య?
Krishnapatnam: మళ్లీ ఆనందయ్య ను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సమాచారం.
Krishnapatnam Anandaiah:(File Image)
Krishnapatnam: మళ్లీ ఆనందయ్య ను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సమాచారం అందుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను తీసుకెళ్లినట్లు సమాచారం. మరో వైపు ఆనందయ్య మందు పై నేడు తుది నివేదిక వస్తుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య రహస్య ప్రాంతానికి తరలించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్టు సమాచారం. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే.