Andhra Pradesh: నల్లమల ఫారెస్ట్‌లో వృద్ధురాలు మిస్సింగ్
Andhra Pradesh: రెండ్రోజుల క్రితం అదృశ్యమైన గోలుసమ్మ * అడవిలో గాలింపు చేపట్టిన పోలీసులు, స్థానికులు
నల్లమల అడవి (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: కర్నూలు జిల్లా మహానంది సమీపంలోని నల్లమల ఫారెస్ట్‌లో రెండ్రోజుల క్రితం ఓ వృద్ధురాలు తప్పిపోయింది. దీంతో.. అడవిలో చిక్కుకున్న మహిళను రక్షించేందుకు పోలీసులు, స్థానికులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. తప్పిపోయిన వృద్దురాలి దగ్గర సెల్‌ఫోన్ ఉండటంతో.. ఆచూకీ గుర్తించడం ఈజీ అయింది. మొబైల్ లొకేషన్ ద్వారా.. వృద్ధురాలు ఉన్న స్థలాన్ని గుర్తించిన పోలీసులు.. ఆమెను సురక్షితంగా కాపాడి.. బయటకు తీసుకువచ్చారు. అయితే.. వృద్ధురాలిని వెతికే ప్రయత్నం చేస్తుండగా.. పెద్దపులి పాదముద్రలను పోలీసులు, స్థానికులు గుర్తించారు.