Gadwal: బతికుండగానే కూతురికి శ్రద్ధాంజలి.. ఎందుకంటే?
Gadwal: కూతురి అంత్యక్రియలకు రావాలంటూ ఆహ్వానం
Gadwal: బతికుండగానే కూతురికి శ్రద్ధాంజలి.. ఎందుకంటే?
Gadwal: ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంగా... కుటుంబ సభ్యులు ఆమెకు బ్రతికుండగానే శ్రద్దాంజలి ఘటించారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేకుంది. అంతేకాదు ఈ నెల 2న తమ సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తాన్నామని, అందరూ హాజరు కావాలంటూ ఆహ్వాన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు కుటుంబ సభ్యులు.
గద్వాల జిల్లా కేంద్రంలో దంత వైద్యురాలుగా కొనసాగుతున్న యువతి, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు... ఆమె మృతి చెందిందని, అంత్యక్రియలు సొంత గ్రామంలో కొనసాగుతాయని, పలు సామజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. అయితే వీరి ప్రేమ పెళ్లి తర్వాత యువతి తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణాహాని ఉందని గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సభ్యుల నుంచి సోషల్ మీడియాలో యువతి మృతి చెందిందని పోస్టులు రావడంతో కుటుంబ సభ్యులపై.. పోస్టులు పెట్టిన యువతి సోదరుడు విజయ్ భాస్కర్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు గద్వాల పట్టణ ఎస్సై రామస్వామి తెలిపారు.