Bommala Koluvu: కోనసీమ జిల్లాలో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
Bommala Koluvu: పెద్ద ఎత్తున హాజరవుతున్న మహిళలు
Bommala Koluvu: కోనసీమ జిల్లాలో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
Bommala Koluvu: డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పల్లంకుర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో హిందువులకు అత్యంత ప్రాముఖ్యమైన సంక్రాంతి, దసరా, దీపావళి, ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, రథసప్తమి, వినాయక చవితి, మహాశివరాత్రి, దసరా, బతుకమ్మ పండుగ, కార్తీక పౌర్ణమి తదితర పండుగలు విశిష్టత గురించి వివరించే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. హిందువుల ఆరాధ్య దైవాలు అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టలక్ష్మి అమ్మవార్లు, అయ్యప్ప స్వామి వారి ఆలయం నమూనాలు, వంటిల్లు, సంప్రదాయ బద్ధమైన కళ్యాణం, మేళ తాళాలు, భాజ భజంత్రీలు తదితర అంశాలు కళ్ళకు కట్టినట్టుగా ఏర్పాటు చేశారు.
ఈ బొమ్మల కొలువు సుమారు వారం రోజులు పాటు శ్రమించి ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువు భోగి పండుగ రోజు మొదలుకొని మూడు రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు చెల్లించి అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బొమ్మల కొలువు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలు అందరికీ అర్థమయ్యేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానికులంటున్నారు.