వైసీపీలోకి అంబటి.. పవన్ కు కుంపటి.. సీఎం జగన్ ఎత్తుగడ ఏంటి..?

Ambati Rayudu: క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెడతారా...వైసీపీలో ఎంట్రీ ఇవ్వనున్నారా..ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-05-11 14:00 GMT

వైసీపీలోకి అంబటి.. పవన్ కు కుంపటి.. సీఎం జగన్ ఎత్తుగడ ఏంటి..?

Ambati Rayudu: క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెడతారా...వైసీపీలో ఎంట్రీ ఇవ్వనున్నారా..ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ గ్యారెంటీ అనే విధంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని అంబటి కలిశారు. అనంతరం అంబటి మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి,క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించానని రాయుడు తెలిపారు. మరోవైపు సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు అంబటి రాయుడు జగన్ మోహన్ రెడ్డిని కలిశారని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అధికారులు చెప్పారు.

అంబటి రాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆయన తరచుగా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగాన్ని అంబటి రాయుడు రీ ట్వీట్ చేశారు. ఏపీలో ప్రతిఒక్కరికీ మీపై నమ్మకం ఉంది సర్ అంటూ కామెంట్ కూడా జోడించారు. నాటి నుంచి అంబటి రాయుడు వైసీపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు మొదలు అయ్యాయి.

గుంటూరు జిల్లాకు చెందని అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మరోవైపు ఏపీలో వీరికి 12 శాతం ఓట్లు ఉన్నాయి. పార్టీ గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఈ వర్గానికి ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పవన్ ను ఢీ కొనేందుకు సీఎం జగన్ ఇప్పటికే కాపు నేతలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు వైసీపీ పై ప్రశంసలు కురిపిస్తూ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. మరి, అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారా లేక ప్రచారం నిర్వహిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మొత్తంగా వైసీపీలో కీలక చేరికలు జరుగుతున్న వేళ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను కలవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

Tags:    

Similar News