Ambati Rambabu: బాలికల గురుకుల పాఠశాలకు మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కలకలం

Update: 2023-02-05 09:08 GMT

Ambati Rambabu: బాలికల గురుకుల పాఠశాలకు మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. ఫుడ్‌పాయిజన్ ఘటన నేపథ్యంలో హాస్టల్‌లోని తాగునీటి వాటర్ ఫ్లాంట్, వంటశాలను మంత్రి పరిశీలించారు. పుడ్ పాయిజన్ ఘటనలో బాధిత విద్యార్థులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఒకరు మాత్రమే చికిత్స పొందుతున్నారని వివరించారు. ఆహారం, తాగునీరు, పారిశుధ్య పనుల మెరుగుదలపై సమీక్షిస్తామని అంబటి రాంబాబు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మంచినీటి కుళాయిలో ఈకొలి అనే బ్యాక్టీరియాను గుర్తించామన్నారు. వంటపాత్రలు శుభ్రం చేస్తున్న సమయంలో తాగునీటిలోకి మురుగునీరు చేరిందని మంత్రి రాంబాబు వెల్లడించారు. 

Tags:    

Similar News