Ambati Rambabu: వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లితే సహించేది లేదు..
Ambati Rambabu: కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
Ambati Rambabu: వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లితే సహించేది లేదు..
Ambati Rambabu: కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కరోనా సంక్షోభం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని అంబటి తెలిపారు.
టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు 55 వేల కోట్లు ఖర్చు పెట్టారని, వైసీపీ కేవలం 15 వేల కోట్లే ఖర్చు పెట్టిందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులు చేయలేదని అంబటి విమర్శించారు. వైసీపీ హయాంలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు.