జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు
* అన్నయ్య వస్తాడని ఎదురుచూసి మోసపోవద్దు- అంబటి * తమ్ముళ్లతో సర్దుకుని సాగిపో సుమా- అంబటి
Ambati Rambabu and Pavankalyan (file image)
జనసేనాని పవన్‌కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. జనసేనలో చిరు చేరతారన్న ప్రచారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. అన్నయ్య వస్తాడని ఎదురుచూసి మోసపోకు తమ్ముళ్లతో సర్దుకుని సాగిపో సుమా అంటూ ట్వీట్ చేశారు అంబటి. నిన్న కాపులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ అన్నగా చిరంజీవి తన విజయాన్ని కోరుకునే వ్యక్తి అని కామెంట్ చేశారు. అంతకుముందు నాదెండ్ల మనోహర్ కూడా చిరు మద్దతుపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.