Ambati Rambabu: అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు శునకానందం పొందొద్దని..!
Renu Desai: ఏపీ పాలిటిక్స్‌పై రేణుదేశాయ్ స్పందించారు. రాజకీయంగా పవన్‌కు మద్దతిస్తున్నానన్న రేణుదేశాయ్... పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదన్నారు.
Ambati Rambabu: అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు శునకానందం పొందొద్దని..!
Renu Desai: ఏపీ పాలిటిక్స్‌పై రేణుదేశాయ్ స్పందించారు. రాజకీయంగా పవన్‌కు మద్దతిస్తున్నానన్న రేణుదేశాయ్... పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదన్నారు. తన విషయంలో పవన్ తీరు తప్పేనన్న ఆమె.. సమాజానికి మంచి చేయాలనుకుంటున్నారని వివరించారు. దాని కోసం కుటుంబాన్ని పక్కన పెట్టారన్నారు. మూడు పెళ్లిళ్లపై దయచేసి చర్చ ఆపండని.. పవన్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై సినిమా, వెబ్‌సిరీస్ తీస్తున్నట్లు కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తన పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలను.. ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండని సూచించారు.
తాజాగా ఈ వీడియో పై అంబటి రాంబాబు స్పందించాడు. తమ క్యారెక్టర్లను వారి సినిమాలలో పెట్టి శునకానందం పొందవద్దని పవన్ కల్యాణ్‌కు చెప్పాలని సూచించారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !' అని ట్వీట్ చేశారు.