Amaravathi: 'స్టే' ల బాబు చంద్రబాబు - కొడాలి నాని

Amaravathi: చంద్రబాబు తనకు ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్‌ను, పలుకుబడిని ఉపయోగించి స్టే తెచ్చుకున్నారని కొడాలి నాని అన్నారు.

Update: 2021-03-20 08:49 GMT

అమరావతి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Amaravathi: మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు స్టేల బాబు అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తన పలుకుబడిని ఉపయోగించి నాలుగు వారాలు స్టే తెచ్చుకున్నారని.. అది తాత్కాలికం మాత్రమే అన్నారు. ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. చంద్రబాబు తనకు ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్‌ను, పలుకుబడిని ఉపయోగించి స్టే తెచ్చుకున్నారన్నారు. ఈ రాష్ర్టంలో కాని, దేశంలో కానీ అత్యంత పిరికి వ్యక్తి చంద్రబాబు అన్నారు.

కోర్టుల్లో విచారణ ఎదుర్కోలేని వ్యక్తి...

కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునే చంద్రబాబు కు గడిచిన ఎన్నికలలో ప్రజలు మంచి గుణపాఠం చెప్పారన్నారు నాని. కోర్టులలో విచారణ ఎదుర్కోలేని వ్యక్తి నారా చంద్రబాబు, కోర్టులో క్యాష్ పిటిషన్ వేసి 4 వారాలు గడువు తీసుకున్న పిరికి వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికలలో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు ఇంటికే పరిమితమవుతారన్నారు. చంద్రబాబు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటారన్నారు మంత్రి కొడాలి నాని. తాత్కాలికంగా చంద్రబాబు వాటిని ఆపుకోగలరు.. కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉందన్నారు. 

Tags:    

Similar News