వైసీపీకి మరో షాక్.. చీరాలలో వెలిసిన ఫ్లెక్సీలు..!
Amanchi Swamulu: రాష్ట్రంలో వైసీపీకి మరో షాక్ తగిలింది.
వైసీపీకి మరో షాక్.. చీరాలలో వెలిసిన ఫ్లెక్సీలు..!
Amanchi Swamulu: రాష్ట్రంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా పేరు ఉన్న ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఆమంచి స్వాములు పాల్గొనబోతున్నట్టు చీరాల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ నుంచి పర్చూరు నియోజకవర్గ టికెట్ ఆశించిన స్వాములకు పార్టీ నుంచి ఎటువంటి హామీ లభించలేదు. దీంతో ఆయన పార్టీ మారాల నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయన జనసేన తరుపున కొత్తూరు నియోజకవర్గం నుంచి కానీ, గిద్దలూరు నుంచి కానీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.