అదిరిందయ్యా ఆర్కే.. పొగడ్తలతో ముంచేసిన నెటిజన్లు!

Update: 2019-07-08 10:37 GMT

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. వైసీపీ నేత, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అనే అర్హతలతో పాటు జనం మెచ్చిన జననేతగా ఆర్కేకు మంచి పేరుంది. అందుకే అక్కడి ప్రజలు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్‌ను పక్కనపెట్టి ఆర్కేకే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. ఇక నారా లోకేశ్ పై గెలుపుతో మంచీ ఊపుమీద ఉన్న ఆర్కే ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన కారే.. కారేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరీ ఇప్పటి లెటెస్ట్ కారు కాదంటి మరీ ఆ కారును హిందుస్తాన్ మోటాల్స్ ఈ 1972లో తయారు చేసింది.

ఆ పాత కారును అద్భుతంగా తయారు చేశారు. భారత్‌లో ఒకప్పుడు అంబాసిడర్ కారు ఎంత పాపులరో అందరికీ తెలుసు. భారత్‌లో ఒకప్పుడు అంబాసిడర్ కారును స్టేటస్ లాగా భావించేవారు. ఇప్పుడు ఆర్కే వద్ద కూడా అంబాసిడర్ కారు ఉంది. ఈ కారుపైనే తాను అసెంబ్లీకి వెళ్తానని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. APK 5155 అనే నెంబర్ గల కారును శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకున్నారు. తనకు నల్ల రంగు చాలా ఇష్టమని, వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఈ కారులో వస్తానని తెలిపారు. ఆ కారుకి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా అంటించారు. ఆర్కే పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆయన మిత్రులు, అభిమానులు మాత్రం అదిరిందయ్యా ఆర్కే అంటున్నారు. 



 


Tags:    

Similar News