Arrangements For August 15 celebrations : స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Arrangements For August 15 celebrations : రేపు (ఆగస్టు 15) జరగబోయే పంద్రాగస్టు వేడుకలకి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం అన్ని విధాలుగా సిద్దం

Update: 2020-08-14 09:32 GMT
DGP Gautam Sawang (File Photo)

Arrangements For August 15 celebrations : రేపు (ఆగస్టు 15) జరగబోయే పంద్రాగస్టు వేడుకలకి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం అన్ని విధాలుగా సిద్దం అయినట్లుగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. స్వయంగా అయన శుక్రవారం మున్సిపల్‌ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం సంసిద్ధం అయినట్టుగా వెల్లడించారు. కరోనా నేపధ్యంలో జరుగుతున్న వేడుకలు కావడంతో నిబంధనలు కచ్చితంగా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్‌ రిహార్సల్స్‌ని పరిశీలించిన అయన వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్‌లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఆయన వెంట సీఎస్‌ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. ఇక రేపు ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు.

క‌రోనా విజృంభిస్తున్న నేపధ్యంలో జరుగుతున్న వేడుకలు కావడంతో గ‌తంలో క‌న్నా భిన్నంగా ఈ సారి వేడుకలు నిర్వహించ‌నున్నారు. అతిథులు కూర్చునే కుర్చీల‌ను రెండు నుంచి మూడు గజాల దూరంలో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News