Visakhapatnam: రెడ్ జోన్ ప్రాంతాల్లో వాలంటీర్లు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతల్లో వాలంటర్లు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని పశ్చిమజోన్ ఏసీపీ జి.స్వరూపరాణి పెర్కొన్నారు.

Update: 2020-04-10 18:10 GMT

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో వాలంటీర్లు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని పశ్చిమజోన్ ఏసీపీ జి.స్వరూపరాణి పెర్కొన్నారు.ఈ మేరకు ఐటిఐ కూడలి, బిఆర్టీఎస్ రహదారి వద్ద శుక్రవారం సాయంత్రం జీవీఎంసీ జోన్ - 4 కమిషనర్ పి.సింహచలం, తహశీల్ధార్ బి.వి.రాణి, సహయక పౌర సరపర శాఖ అదికారి మూర్తి సమక్షంలో గ్రామ సచివాలయం కార్యదర్శులు, వాలంటరీలతో సమీక్ష సమవేశం నిర్వహించారు.

ఈసందర్బంగా జోన్ ఏసీపీ జి.స్వరూపరాణి మాట్లడుతూ... విధినిర్వహణలో తమపై ఎవరైన దురుసుగా ప్రవర్తిస్తే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతల్లో సచివాలయ సిబ్బందిపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసారు.

సమావేశంలో పాల్గొన్న జీవీఎంసీ జోన్ - 4 కమిషనర్ పి.సింహచలం మాట్లడుతూ... ఇప్పటికే కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ప్రాంతాలను రెడ్ జోన్ లుగా గుర్తించామని ఆయా జోన్ల పరిథిలో ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రాకుండ వాలంటరీలు ప్రతి ఇంటికి నిత్యవసర వస్తువులు చేరవేసే విదంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. తహశీల్ధార్ బి.వి.రాణి మాట్లడుతూ... కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో సమస్యత్మక ప్రాంతల్లో విదులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తూ విదులు నిర్వహించాలని సూచించారు.

సహయక పౌర సరపర శాఖ అదికారి మూర్తి మాట్లడుతూ... ఈనెల 16 వ తేది నుండి రెండవ విడత రేషన్ ను రెడ్ జోన్ ప్రాంతల్లో వాలంటరీల ద్వార పంపిణీ చేయడం జరుగుతుందని అందులో బాగంగ ఈసారి అందించే రేషన్ లో బియ్యం తో పాటుగా శనగపప్పు లబ్ది దారులకు అందించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో కంచరపాలెం సి.ఐ కృష్ణరావు, ఎస్.ఐ అప్పల నాయుడు, విజయ్, లొకేశ్వరావు, మహేశ్వరావు, జీవీఎంసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News