ACB Raids: ఏపీ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.

Update: 2025-11-06 09:48 GMT

ACB Raids: ఏపీ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. బుధవారం ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి.

బుధవారం నాటి దాడుల్లో ఏసీబీ అధికారులు కొన్ని కార్యాలయాల్లో లెక్క చూపని నగదును గుర్తించారు. తనిఖీల్లో భాగంగా డాక్యుమెంట్లు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అధికారులకు, సిబ్బందికి నగదు పంపిణీ జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

అవినీతి కార్యకలాపాలపై పూర్తిస్థాయి సమాచారం కోసం ఏసీబీ అధికారులు ఈ రోజు (గురువారం) కూడా తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Tags:    

Similar News