శ్రీచరణ్‌కి గ్రూప్ 1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నజరానా
మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం ప్లేయర్ శ్రీచరణ్‌కి ACA ఛైర్మన్ కేశినేని చిన్న ఘనస్వాగతం పలికారు.
మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం ప్లేయర్ శ్రీచరణ్‌కి ACA ఛైర్మన్ కేశినేని చిన్న ఘనస్వాగతం పలికారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఆమెను సత్కరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో ఆమె భేటీ అయ్యారు. ఏసీఏ అన్ని విధాలుగా తనకు తోడుగా ఉందని శ్రీచరణ్ తెలిపారు.
ఏసీఏ అధ్యక్షులు కేశినేని చిన్ని మద్దతు మరువలేనిదన్నారు. శ్రీచరణ్‌కి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పినట్లు కేశినేని చిన్ని తెలిపారు. ఉద్యోగంతో పాటు రెండున్నర కోట్ల నగదు, కడపలో స్థలం ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా క్రికెటర్ అకాడమిని త్వరలో ప్రారంభిస్తామన్నారు కేశినేని చిన్ని.