Vijayawada: రైలులోనే మహిళ ప్రసవం
Vijayawada: తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్న వైద్యులు
Vijayawada: రైలులోనే మహిళ ప్రసవం
Vijayawada: రైలులోనే మహిళ ప్రసవించిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం గర్భిణీని నెల్లూరు నుంచి మంచిర్యాలకు ట్రైన్‌లో తీసుకెళ్తున్నారు బంధువులు. విజయవాడ కృష్ణ కెనాల్ చేరుకోగానే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ట్రైన్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే మహిళను, పసికందును విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు మంచిర్యాల తీసుకెళ్తున్నారు.