Andhra Pradesh: గుంటూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలు

Andhra Pradesh: కరోనా చికిత్సకు అనుమతి లేక పోయినా.. * వైద్యం చేసి లక్షలు వసూలు చేస్తున్న యాజమాన్యం

Update: 2021-05-28 11:59 GMT

ప్రైవేట్ హాస్పిట(ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం ఒక పక్కన అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నా.. ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ చికిత్సకు అనుమతి లేకపోయినా.. వైద్యం చేసిన బాధితుల దగ్గర నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కోవిడ్ పాజిటివ్ తో ఏప్రిల్ 16న గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. ఆయన ఏప్రిల్ 26న మృతి చెందాడు. కోవిడ్ రోగి దగ్గర మెడిసిన్‌కు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే.. డెత్ సర్టిఫికేట్, మెడిసిన్ బిల్స్ అడిగితే బాధితులపై ఆస్పత్రి యాజమాన్యం దాడి చేసింది. ఆస్పత్రిపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News