సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది.

Update: 2020-02-27 03:26 GMT

సామాజిక మాధ్యమాలల్లో కొందరూ తమకు నచ్చని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా, నచ్చిన వారికి అనుకూలంగా రకరకాల పోస్టులు పెడుతుంన్నారు. కొందురు అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న కొంత మంది పట్టించుకోవడం మానేశారు. పిచ్చి రాతలు రాస్తూ.. శృతి మించితే మాత్రం పోలీసులు వారి తాట తీస్తున్నారు. ఓ నెటిజన్ సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన వైసీపీ నాయకుడు సీఎం పరిపాలన నచ్చకపోతే రాజ్యాంగ బద్ధంగా విమర్శలు చెయ్యాలి గానీ, అసభ్యకర వ్యాఖ్యలు ఏంటని పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. కడపజిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన పుల్లయ్య సీఎం జగన్ పై అసభ్యకరంగా మాట్లాడుతూ.. టిక్ టాక్ వీడియో చేశాడు. దీనిపై దువ్వూరు మండలం పెద్దజొన్నవరానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పుల్లయ్యపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News