SVU: తిరుపతి ఎస్వీ వర్సిటీలో చిరుత.. పరుగులు తీసిన విద్యార్థులు

SVU: కానీ అది చిరుత కాదని, జింక అని అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Update: 2023-08-15 02:19 GMT

SVU: తిరుపతి ఎస్వీ వర్సిటీలో చిరుత.. పరుగులు తీసిన విద్యార్థులు

SVU: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో చిరుత పులి కనిపించింది. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. చిరుత సంచారంపై వర్శిటి సెక్యూరిటీ అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తిరుమల కొండపై చిరుతలు కలకలం సృష్టిస్తుండగా.. ఇప్పుడు తిరుపతిలో కూడా చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. ఎస్వీ యూనివర్సిటీలో గతంలోనూ చిరుతలు కనిపించాయి. ఇప్పుడు మరోసారి కనిపించడంతో విద్యార్థుల్లో ఆందోళనకు గురయ్యారు.

ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే బాలికపై అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేసి చంపేసిన ఘటన మరువకముందే ఇవాళ ఉదయం మెట్ల మార్గంలో ఒక చిరుత కనిపించింది. అలాగే సోమవారం ఉదయం కూడా నడకమార్గంలో ఒక చిరుత కనిపించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది చిరుత కాదని, జింక అని అటవీశాఖ అధికారులు గుర్తించారు. లక్షిత ఘటన తర్వాత చిరుతలను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది బోన్లు, ట్రూప్ కెమెరాలను అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీంతో ఇవాళ ఉదయం ఒక ఆడ చిరుత బోన్‌లో చిక్కుకుంది. లక్షితపై దాడి చేసింది ఈ చిరుతేనా? కాదా? అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. మరో ఐదు చిరుతల కదలికలు సీసీ కెమెరాల్లో కనిపించాయని, వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే తెలిపారు.

Tags:    

Similar News