Jammu and Kashmir: జమ్మూలో విశాఖ జిల్లాకు చెందిన జవాన్ మృతి ..
Jammu and Kashmir: తొమ్మిదేళ్ల క్రితం ఆర్మీలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్న..
Jammu and Kashmir: విశాఖ జిల్లాకు చెందిన జవాన్.. విద్యుత్ షాక్ కు గురై మృతి
Jammu and Kashmir: జమ్మూలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న విశాఖ జిల్లాకు చెందిన ఓ జవాన్ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. చిట్టివలసకు చెందిన కొల్లి పూర్ణ రామచంద్రారెడ్డి జమ్మూలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. తొమ్మిదేళ్ల క్రితం ఆర్మీలో జవాన్ గా విధుల్లో చేరి.. టెన్ ఇన్ఫాంట్రీ డిఓ సిగ్నల్ లో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు . మృతుడు పూర్ణరామచంద్రారెడ్డికి పాత చెరుకుపల్లి ప్రాంతానికి చెందిన భవాని లక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది. జవాన్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నెల 26 న సెలవు పై వచ్చి వచ్చే నెల ఒకటవ తేదీన తన కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేద్దామని తెలియజేశారని బంధువులు బోరున విలపించారు.