Bhadradri Kothagudem: ఇంట్లోకి వచ్చిన భారీ కొండచిలువ.. భారీపామును రక్షించడమే లక్ష్యంగా పట్టుకున్న గ్రామస్తులు

Bhadradri Kothagudem: కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించిన గ్రామస్ధులు

Update: 2023-08-12 06:47 GMT

Bhadradri Kothagudem: ఇంట్లోకి వచ్చిన భారీ కొండచిలువ.. భారీపామును రక్షించడమే లక్ష్యంగా పట్టుకున్న గ్రామస్తులు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో ఇంట్లోకి వచ్చిన భారీ కొండచిలువను స్ధానికులు పట్టుకొని అటవీశాఖ సిబ్బందికి అప్పజెప్పారు.గత కొన్ని రోజులుగా కోడి పిల్లలు మాయం అవుతున్న నేపథ్యంలో ఇవి ఎలా మాయం అవుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. ఒక కోడి పిల్లను కొండచిలువ పట్టడాన్ని గ్రామంలోని ఒక ఇంట్లో గమనించారు. దీనితో కంగారు పడిన కొండచిలువ కోడి పిల్లలను వదిలేసి గడ్డివాము కింద దూరింది. స్థానిక యువకులు కొండచిలువకు ఎటువంటి హాని చేయకుండా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేందుకు .. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి అప్పగించారు.

ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న పలు మండలాల పరిధిలో పాముల సంచారం ఉంటుంది. ఇళ్లలోనికి వచ్చిన పాములకు ఎటువంటి హాని తలపెట్టకుండా వాటిని అటవీ ప్రాంతంలో వదిలేలా రొంపేడు గ్రామస్తులు వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పాముకు చిన్న హానీ కూడా తలపడకుండా పట్టుకొని అటవీశాఖ సిబ్బందికి అప్పగించామని గ్రామస్తుడు నాయిని రాజు తెలిపారు.

Tags:    

Similar News