Bus Fire: ప్రకాశం జిల్లాలో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
Bus Fire: హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తుండగా ఘటన
Bus Fire: ప్రకాశం జిల్లాలో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
Bus Fire: ప్రకాశం జిల్లా బిట్రగుంట వద్ద బస్సుకు ప్రమాదం జరిగింది. జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారి పై ట్రావెల్ బస్సులోంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా దిగేశారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తుండగా ప్రకాశం జిల్లా బిట్రగుంటవద్ద ఈ ఘటన జరిగింది. బస్సుల్లోంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాక చక్యంగా ప్రయాణికులను దించేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు ప్రాణ భయంతో దిగేశారు. ప్రయాణికుల లగేజి మాత్రం మంటల్లో కాలిపోయింది.