Coronavirus: ఏపీలో కరోనా తిరగబెడుతోందా?

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరిగిపోతున్నారు.

Update: 2021-03-29 11:27 GMT

Coronavirus: ఏపీలో కరోనా తిరగబెడుతోందా?

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ వెయ్యి లేదా అంతకంటే ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. నిన్నమొన్న కరోనా కేసులు వెయ్యి దాటేయగా, ఇవాళ 997మంది వైరస్ బారిన పడ్డారు. గత 24గంటల్లో 31వేల 325 శాంపిల్స్‌ను పరీక్షించగా 997మందికి వైరస్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం వెయ్యా రెండు వేలు మాత్రమే ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు ఏకంగా 6వేలు దాటేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6వేల 104 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 181 కేసులు నమోదు కాగా అనంతపురంలో 57 తూర్పుగోదావరిలో 28 గుంటూరులో 152 కడపలో 45 కృష్ణాలో 110 కర్నూలులో 82 నెల్లూరులో 84 ప్రకాశంలో 41 శ్రీకాకుళంలో 61 విశాఖలో 139 విజయనగరంలో 4 పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, కోవిడ్ బారినపడి గత 24గంటల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సం‌ఖ్య 7వేల 210కి చేరింది. 


Tags:    

Similar News