AP Corona Cases: కొత్తగా 7,796 మందికి పాజిటివ్
AP Corona Cases: గడిచిన 24గంటల్లో 77 మంది మృతి * రాష్ట్రంలో మొత్తం కేసులు 17,71,007
Representational Image
AP Corona Cases: ఏపీలో మరోసారి కోవిడ్ కేసులు పెరిగాయి. కొత్తగా 7వేల 796 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి 77 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 17 లక్షల 71వేల 7 కాగా.. ఇప్పటివరకు 11వేల 629 మంది మృతి చెందారు. ఇక.. కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి 16 లక్షల 51వేల 790 మంది డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 7వేల 588 యాక్టివ్ కేసులు ఉన్నాయి.