AP Corona Cases: ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు, 15 మంది మృతి
AP Corona Cases: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
AP Corona Cases: ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు, 15 మంది మృతి
AP Corona Cases: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 7వేల 224 మందికి కరోనా సోకింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9లక్షల 55వేల 455కు చేరింది. తాజాగా కరోనా బారిన పడి 15 మంది మృత్యువాత పడడంతో రాష్ట్రంలో 7వేల 388 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా నెల్లూరులో 3, కర్నూలులో 2, విశాఖలో 2, గుంటూరు, కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.