Madanapalle Kidney Racket: మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కలకలం.. మహిళ మృతితో..!

Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం కలకలం సృష్టించింది.

Update: 2025-11-12 09:11 GMT

Madanapalle Kidney Racket: మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కలకలం.. మహిళ మృతితో..! 

Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం కలకలం సృష్టించింది. మానవ అవయవాల అక్రమ రవాణాకు ప్రయత్నించిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన యమున అనే మహిళకు గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేయించగా, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

యమున మరణించగానే, మృతదేహాన్ని తిరుపతికి తరలించే ప్రయత్నం చేశారు. మృతురాలి తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి మదనపల్లె టూ టౌన్‌కు సమాచారం అందించారు. నింధితులపై చీటింగ్, మానవ అవయవాల అక్రమ రవాణా, హత్య వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని మదనపల్లి టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News