పోలీస్ స్టేషన్​లో ఆరేళ్ల బాలుడు.. సమస్యేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Palamaner: ఆరేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు..బడికి వెళ్లి చదువుకుంటారు.

Update: 2022-03-20 11:30 GMT

పోలీస్ స్టేషన్​లో ఆరేళ్ల బాలుడు.. సమస్యేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Palamaner: ఆరేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు..బడికి వెళ్లి చదువుకుంటారు. ఆ తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటారు. కానీ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఆరేళ్ల బుడతడు మాత్రం..ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఓ ఫిర్యాదు కాగితాన్ని అందించాడు. అదేంటి ఆరేళ్ల వయసులో అంతటి ఘనకార్యం చేశాడంటే నిజంగానే చేశాడనే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వాన్నే ప్రశ్నించేస్థాయికి వెళ్లాడు బుడతడు.

చిత్తూరు జిల్లా పలమనేరులో తాను చదువుతున్న స్కూల్ ముందు రోడ్డును జేసీబీలతో ఇష్టారాజ్యంగా తవ్వేసారు. ఆ తర్వాత గుంతలను పూడ్చలేదు. దీంతో తవ్వేసిన చోట కొందరు అడ్డదిడ్డంగా వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో ఆ బుడతడికి కోపం వచ్చింది. అడ్డంగా వాహనాలు ఆపే వారిని నిలదీశాడు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషనుకు వెళ్లి సీఐకి కంప్లైంట్ ఇచ్చాడు. సీఐ భాస్కర్ తాము వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని బాలుడికి తెలిపారు. బాలుడికి స్వీట్ తినిపించిన సీఐ భాస్కర్ తన ఫోన్ నెంబర్ కార్తికేయకు ఇచ్చారు. 

Tags:    

Similar News