AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు, 10 మంది మృతి
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు, 10 మంది మృతి
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. నిన్నమొన్నటివరకు రెండు వేలు మూడు వేలు మాత్రమే నమోదైన రోజువారీ కేసులు ఇఫ్పుడు ఏకంగా 4వేలు దాటేశాయి. గత 24గంటల్లో 35వేల 582మందికి పరీక్షలు నిర్వహించగా 4228మందికి వైరస్ సోకింది. రోజువారీ కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25వేల 850 ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇక, గత 24గంటల్లో 10మంది మృత్యువాత పడ్డారు.