4 YSRCP MP's Posts in Central Committees: ప్రమాణస్వీకారం చేసి మూడు రోజులు తిరక్కుండానే..

Update: 2020-07-24 08:04 GMT

4 YSRCP MP's Posts in Central Committees: ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి నూతనంగా రాజ్యసభ ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేసి మూడు రోజులు తిరక్కుండానే వారిని పార్లమెంటులోని పలు కీలక పదవుల్లో నియమించారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. పార్లమెంటు కమిటీలకు సంబంధించిన ఉత్వర్వులను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. అందులో నలుగురు వైసీపీ ఎంపీలకు చోటు లభించింది.

బొగ్గు, ఉక్కు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు నియమితులయ్యారు. అలాగే ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పరిమల్ నత్వాని, పరిశ్రమల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్‌, పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అయోధ్య రామిరెడ్డి లు నియమితులయ్యారు. వీరిలో పరిమళ నత్వాని మినహా అందరూ మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

పరిమళ నత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ రికమెండేషన్ తో పదవి లభించింది. ఇక రాష్ట్ర మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు రాజీనామా చేసి.. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచారు. మోపిదేవి వెంకటరమణ కూడా రేపల్లె నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీలో మొదటినుంచి ఉండటంతో ఆయనకు రాజ్యసభ స్థానం దక్కింది.

Tags:    

Similar News