ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Update: 2019-08-10 04:48 GMT

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి లో వరద ఉధృతి భారీగా పెరుగుతోంది.. రోజు రోజుకు పెరుగుతున్న వరద ఉద్ధృతితో ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడి రేగుతోంది. రోజుల తరబడి లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రోజు రోజుకు వరద మట్టం పెరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి రోజు రోజుకీ పెరుగుతుండటంతో.. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫో ఉంది.. ఇక వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ దిగువన సముద్రంలోకి వదిలేస్తుండటంతో దిగువనున్న గోదావరి లంక గ్రామాలు ముంపుతో విలవిల్లాడుతున్నాయి. 17.75 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటే మూడో ప్రమాదహెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత, శబరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి వచ్చి చేరుతున్న ప్రవాహాన్ని యథాతథంగా దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 44 అడుగులకు తగ్గింది.. నదీపరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు 

Tags:    

Similar News