AP News: ఏపీలో 26 జిల్లా అభివృద్ధి మండళ్లు...

AP News: పార్టీ జిల్లా అధ్యక్షులే చైర్మన్లు

Update: 2022-04-28 02:17 GMT

ఏపీలో 26 జిల్లా అభివృద్ధి మండళ్లు

AP News: ఏపీ సీఎం జగన్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో విబేధాలు సహించబోనన్నారు. విభేదాలు పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో పలు అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు జగన్. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 జిల్లా అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

వాటికి ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులే చైర్మన్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా అభివృద్ధి మండళ్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తామని చెప్పారు. ఈ నియామకాలకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని జగన్ వెల్లడించారు. మే 10 నుంచి 9 నెలల పాటు గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మంత్రులు, పార్టీ నేతలు కలిసికట్టుగా క్షేత్రస్థాయికి వెళ్లి అభివృద్ధి , సంక్షేమ పథకాలు తెలపడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పార్టీని గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులు మంత్రులుగా వస్తారన్నారు.

పార్టీ అధ్యక్షుడిగా తన గ్రాఫ్ 65శాతం ఉందన్నారు జగన్. ఎమ్మెల్యేల్లో చాలా మందికి 40 నుంచి 45శాతం గ్రాఫ్ ఉందని చెప్పారు. ఎన్నికల నాటికి అందరి గ్రాఫ్‌ పెరగకపోతే మార్పులు తప్పవని హెచ్చరించారు. 151 సీట్లకు ఒక్క సీటు తగ్గకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంక్షేమం అందరికి అందిస్తున్నామని... 175 సీట్లు ఎందుకు రాకూడదని జగన్ ప్రశ్నించారు. నేతలు మళ్లీ గెలిపిస్తేనే మంత్రి పదవులు వస్తాయని చెప్పారు.

Tags:    

Similar News