AP Corona Cases: ఏపీలో కొత్తగా 21,230 కేసులు.. ఒక్కరోజులో 99 మంది మృతి

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ మరణమృదంగం మోగిస్తుంది.

Update: 2021-05-18 12:19 GMT

ఏపీలో కొత్తగా 21,230 కేసులు..ఒక్కరోజులో 99 మంది మృతి (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల కంటే.. కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య అత్యధికంగా నమోదు అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో 91 వేల 253 కరోనా సాంపిల్స్ పరీక్షించగా.. అందులో 21 వేల 230 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షల 75వేలు దాటింది.

ఏపీ లో కరోనా తో మరో 99మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9వేల 580కి చేరింది. గడిచిన 24గంటల్లో చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలో పది మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 9మంది, అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8మంది, కర్నూలు, శ్రీకాకుళంలో ఆరుగురు, నెల్లూరు ఐదురుగు చొప్పున కొవిడ్ మరణాలు సంభవించినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. గడిచిన 24గంటల్లో 21వేల 274 మంది కోవిడ్‌ను జయించి వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తూర్పుగోదావరి జిల్లాలో 2 వేల 9వందల 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అనంతపురంలో 2వేల 804, చిత్తూరులో 2వేల 6వందల 30, విశాఖలో 2 వేల 367 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యానట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 

Tags:    

Similar News