ఏలూరు ఘటనలో 150కు చేరిన బాధితులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఉదయం కొత్తగా మరో కొంత మంది ఆస్పత్రిలో చేరారు. దీంతో పలు ఆస్పత్రిల్లో చేరిన బాధితుల సంఖ్య 150కి చేరింది.

Update: 2020-12-06 05:48 GMT

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఉదయం కొత్తగా మరో కొంత మంది ఆస్పత్రిలో చేరారు. దీంతో పలు ఆస్పత్రిల్లో చేరిన బాధితుల సంఖ్య 150కి చేరింది. ఏలూరులో వింత రోగంపై సీఎం జగన్ ఆరా తీశారు. మంత్రి ఆళ్లనానికి పోన్ చేసిన సీఎం జగన్.. అస్వస్థతకు గురైన వారి గురించి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఏలూరు ఘటనలో బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు., టెస్ట్ ల కోసం వైరాలజీ ల్యాబ్ కు పంపారు. మరోవైపు, ఆస్పత్రికి వస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరగడంతో.. ఏలూరు ఆస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ఏలూరుకు హుటహిటిన ప్రత్యేక వైద్య బృందాన్ని పిలిపించారు. అస్వస్థతకు గురైన బాధితులకు చికిత్స అందించేందుకు.. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుల సాయం తీసుకుంటున్నారు.

ఏలూరు ఘటనలో బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు., టెస్ట్‌ల కోసం వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. మరోవైపు, ఏలూరు ఆస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాన్ని పిలిపించారు. చికిత్స కోసం ప్రైవేటు వైద్యుల సాయం తీసుకుంటున్నారు.

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పలువురు కోలుకోగా.. ఇప్పటి వరకు 20 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. బాధితుల పెరగడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు బెడ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ఏలూరుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా తీకొస్తున్నారు. 

Tags:    

Similar News