Coronavirus: ఏపీలో కొత్తగా 1271 కరోనా కేసులు

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ఏ రోజుకారోజు బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

Update: 2021-04-01 13:43 GMT

Coronavirus: ఏపీలో కొత్తగా 1271 కరోనా కేసులు

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ఏ రోజుకారోజు బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రతిరోజూ దాదాపు వెయ్యి కేసులు నమోదవుతుండగా, ఏ రోజుకారోజు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇవాళ కూడా కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటేశాయి. గత 24గంటల్లో 31వేల 809శాంపిల్స్‌ను పరీక్షించగా 12వందల 71మందికి వైరస్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తేలిపింది. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8వేల 142 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

చిత్తూరు, గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరులో 285మందికి, గుంటూరులో 279మందికి కొత్తగా వైరస్‌ సోకింది. అనంతపురంలో 61 తూర్పుగోదావరిలో 27 కడపలో 63 కృష్ణాలో 161 కర్నూలులో 52 నెల్లూరులో 43 ప్రకాశంలో 63 శ్రీకాకుళంలో 21 విశాఖలో 189 విజయనగరంలో 15 పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, కోవిడ్ బారినపడి గత 24గంటల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనంతపురం, గుంటూరు, విశాఖలో ఒక్కొక్కరు మరణించారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సం‌ఖ్య 7వేల 220కి చేరింది. 


Tags:    

Similar News