10th Results 2021 AP: ఇవాళ ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
10th Results 2021 AP: ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఈరోజు విడుదల కానున్న 10 వ తరగతి ఫలితాలు (ఫైల్ ఇమేజ్)
10th Results 2021 AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ సాయంత్రం పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దవ్వడంతో మొదటిసారి గ్రేడ్స్ రూపంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్ లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.