Pawan Kalyan: ఆ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం..
Jana Sena: ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.
Pawan Kalyan: ఆ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం..
Jana Sena: ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్న ఆయన గోదావరి జిల్లాల్లో 80 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే త్వరలో బాధిత కుటుంబాలను తాను పరామర్శిస్తానని స్పష్టం చేశారు. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదని, సాగు చేసుకుంటే రుణం ఇవ్వరు, పంట నష్టపోతే పరిహారం ఇవ్వరంటూ ఏపీ సర్కార్‌కు చురకలు అంటించారు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన నిలుస్తుందని అన్నారు పవన్.