అలాగైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఆళ్ల

Update: 2019-07-08 10:40 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను టీఆర్ఎస్ నుంచి లంచాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే ఆ క్షణమే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆర్కే సవాల్ విసిరారు. నారా లోకేశ్‌లను నేను డైరెక్టుగా అడుగుతున్నా మీ ఇల్లు అక్రమమా? సక్రమమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఓ బీసీ మహిళ(పంచుమర్తి అనురాధ)ను అడ్డు పెట్టుకుని ఆమెతో నాపై విమర్శలు చేయించడం పద్దతి కాదన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అర్హులైన వారికి పెన్షన్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారి, రాజకీయనేత చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్పిన అవసరంలేదని అన్నారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి అర్హుల ఇళ్ల వద్దకే పింఛన్‌ అందిస్తామని చెప్పారు.

Tags:    

Similar News